AI అంటే కంప్యూటర్ మనం ఇచ్చిన సూచనల నుంచి టెక్స్ట్, చిత్రాలు, ఆడియో వంటివి తయారు చేసే సాంకేతికత. ఈ గైడ్‌లో ప్రాథమిక విషయాలు మాత్రమే చెబుతున్నాం.
AI ఏం చేయగలదు
ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, టెక్స్ట్ రాయడం, అనువదించడం, సారాంశం చెప్పడం, చిత్రాలు సూచించడం వంటి పనులు AI చేయగలదు. కానీ ప్రతి సమాధానం సరైనదని చెప్పలేం.
ఎక్కడ మొదలుపెట్టాలి
ముందుగా ఒక అసిస్టెంట్‌ను ఎంచుకోండి. మా AI Tools పేజీలో అధికారిక లింకులు ఉన్నాయి. చిన్న, సులభమైన పనులతో మొదలుపెట్టండి.
జాగ్రత్తలు
మీ వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు AI చాట్‌లో ఇవ్వకండి. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పుడూ నమ్మదగిన మూలం నుంచి చెక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
AI వాడటానికి ఇంగ్లీష్ రావాలా?
అవసరం లేదు. చాలా టూల్స్ తెలుగులో కూడా అడగవచ్చు. కానీ సమాధానం నాణ్యత టూల్‌ను బట్టి మారవచ్చు.
AI ఎప్పుడూ నిజమే చెబుతుందా?
లేదు. కొన్నిసార్లు తప్పు సమాచారం ఇవ్వవచ్చు. ముఖ్యమైన విషయాలను మీరే చెక్ చేయాలి.

No comments:
Post a Comment